తెలంగాణ

telangana

ETV Bharat / international

థెరిసా మే ప్రధాని పదవికి బ్రెగ్జిట్​ గండం - లండన్

బ్రెగ్జిట్ సమస్య బ్రిటన్ ప్రధాని థెరిసా మే పదవికి ఎసరుపెట్టేలా ఉంది. బ్రెగ్జిట్​ ప్రక్రియను థెరిసా మే సరిగ్గా నిర్వర్తించలేకపోయారని.. సొంత మంత్రివర్గం నుంచే ఆమె రాజీనామాకు ఒత్తిడి పెరిగిపోతోందంటూ బ్రిటన్​ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

థెరిసా మే ప్రధాని పదవికి బ్రెగ్జిట్​ గండం

By

Published : Mar 25, 2019, 7:24 AM IST

Updated : Mar 25, 2019, 9:27 AM IST

థెరిసా మే ప్రధాని పదవికి బ్రెగ్జిట్​ గండం

బ్రిటన్ ప్రధాని థెరిసా మే కి బ్రెగ్జిట్​ గండం పట్టుకుంది. సొంత మంత్రివర్గం నుంచే ఆమె రాజీనామా కోసం ఒత్తిడి పెరిగిపోతోంది. బ్రెగ్జిట్​ ప్రక్రియను థెరిసా మే సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా వైదొలిగితే అది బ్రిటన్​కే నష్టమని ప్రధాని థెరిసా మే చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రవేశపెట్టిన 'నో డీల్​ బ్రెగ్జిట్​'ను చట్టసభ్యులు రెండు సార్లు తిరస్కరించారు. వచ్చేవారం బ్రెగ్జిట్​పై మూడోసారి పార్లమెంట్​లో ఓటింగ్​ జరగనుంది. ఇందులో థెరిసా ప్రతిపాదన నెగ్గకపోతే, అది ఆమె రాజీనామాకు దారితీసే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు.

థెరిసా మే కి వ్యతిరేకంగా ఉన్న చట్టసభ్యులు, మంత్రులు డేవిడ్​ లిడింగ్టన్​ను, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాను మాత్రం ప్రధాని 'థెరిసా మే' కే మద్దతుగా ఉంటానని లిడింగ్టన్​ పేర్కొనడం విశేషం.

మరోవైపు యూకే ఛాన్సిలర్ ఫిలిప్​ హమ్మండ్, ప్రధాని 'థెరిసా మే' కి అండగా నిలిచారు. ప్రధానమంత్రులను మార్చడం, మరో పార్టీకి ప్రభుత్వాధికారం రావడం వలన ఉపయోగం లేదని, చట్టసభ్యులను ఉద్దేశించి ఫిలిప్​ అన్నారు. చట్టసభ్యులు థెరిసా మేకి మద్దతుగా నిలవాలని సూచించారు.

మరోసారి రెఫరెండమ్​ కోసం...

శనివారం దాదాపు ఒక మిలియన్ ప్రజలు లండన్ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. బ్రెగ్జిట్​పై రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
బ్రిగ్జిట్​ గడువును ఈయూ మార్చి 29 నుంచి ఏప్రిల్ 12 వరకు పొడిగించింది. థెరిసా మే 'నో డీల్​ బ్రెగ్జిట్'​కు చట్టసభ ఆమోదం లభిస్తే ఈ గడువు మే 22 వరకు పొడిగించడానికి ఈయూ అంగీరించింది.

వచ్చేవారం హౌస్ ఆఫ్​ కామన్స్ (దిగువ సభ)​ స్పీకర్​ జాన్​ బార్కో అనుమతితో ఈ అంశం చర్చకు రానుంది. ఒకవేళ మరలా థెరిసా మే ప్రతిపాదన వీగిపోతే, ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్​ ఈయూ నుంచి ఏప్రిల్​ 12న వైదొలుగుతుంది. అదే జరిగితే థెరిసా మే రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి పెరుగుతుంది.

ఇదీ చూడండి :భారత్​-పాక్​ మంత్రుల మధ్య ట్వీట్ల యుద్ధం

Last Updated : Mar 25, 2019, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details