బ్రిటన్‌లోని ప్రజలకు ప్రతి చిన్న సంఘటనకు గుర్తొచ్చేది పబ్. ఆనందమైనా, బాధైనా వెంటనే పబ్‌కు వెళ్లిపోతారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రపంచదేశాలతో పాటు బ్రిటన్‌లోనూ కరోనా వ్యాప్తి క్రమంలో లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా బీరు చేతికందకా నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికోసమే 'పబ్ ఇన్ ఎ బాక్స్' పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సిగ్నేచర్ బ్రూ అనే బీర్ల తయారీ సంస్థ. బీరు తాగాలని అనిపిస్తే చాలు.. వారి ఇంటి వద్దకే పబ్‌ను తీసుకొస్తుంది.
బ్రిటన్‌లో ఇంటివద్దకే బీరును అందించడం ఇదే తొలిసారి అని నిర్వహకులు చెబుతున్నారు.
ప్రజలు ఇప్పటికీ బీరు తాగాలని కోరుకుంటున్నారని, ఇంట్లోనూ పబ్ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. బ్రిటన్ ప్రజలు మంచి, చెడు ఎలాంటి సందర్భాల్లోనైనా పబ్‌కు వెళతారు. నాకు జ్ఞాపకమున్నంత వరకు ఇలా పబ్‌లకు రాలేకపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా కారణంగా చాలామంది తమ ఇళ్లల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అందుకే పబ్‌ను ఒక పెట్టెలో వారి ఇంటివద్దకే తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది.