కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ధ్వంసమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 105 దేశాల్లో సంస్థ చేపట్టిన సర్వే ఆధారంగా తక్కువ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థపై కరోనా సంక్షోభం తీవ్ర ప్రభావం చూపినట్లు వెల్లడించింది.
కరోనా ప్రబలినప్పటి నుంచి ఇతర వైద్య సేవల విషయంలో అంతరాయం ఏర్పడిందని 70 శాతం దేశాలు అంగీకరించినట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ స్పష్టం చేశారు.
"హృద్రోగ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, కుటుంబ నియంత్రణ తదితర చికిత్స, డయాగ్నోసిస్కు సంబంధించి 90 శాతం దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మన ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత అవసరం."