తెలంగాణ

telangana

ETV Bharat / international

తెలుగు వైద్యుడికి బ్రిటన్​ ఉన్నత పురస్కారం

బ్రిటన్​ ప్రఖ్యాత నేషనల్​ హెల్త్​కేర్​ సర్వీస్​(ఎన్​హెచ్​ఎస్​) పార్లమెంటరీ అవార్డును డాక్టర్​ ఘట్టమనేని హనుమంతరావు సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా వాసి అయిన హనుమంతరావుకు.. 44 ఏళ్లుగా క్రిస్టీ ఆస్పత్రి వైద్యునిగా సేవలందించినందుకు గానూ ఈ గుర్తింపు దక్కింది.

THE CHRISTIES DR GATTAMANENI WINS NHS PARLIAMENTARY AWARD AFTER NOMINATION FROM JEFF
బ్రిటన్​ ప్రఖ్యాత​ ఎన్​హెచ్​ఎస్​ అవార్డు ఈ ఏడాది తెలుగోడికే..

By

Published : Nov 24, 2020, 1:49 PM IST

Updated : Nov 24, 2020, 2:50 PM IST

బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత నేషనల్​ హెల్త్​కేర్ సర్వీస్​(ఎన్​హెచ్​ఎస్)​ పార్లమెంటరీ అవార్డ్‌ను డాక్టర్‌ ఘట్టమనేని హనుమంతరావు దక్కించుకున్నారు. బాల్యంలో వచ్చే కేన్సర్‌ను నయం చేయడం సహా.. 44 ఏళ్ల నుంచి క్రిస్టీ ఆస్పత్రి వైద్యునిగా ఆయన అసమాన సేవలందించారు. ఆ విశిష్ట సేవలకు గుర్తింపుగా హనుమంతరావును నామినేట్​ చేశారు ఎంపీ జెఫ్‌ స్మిత్‌.

జాతీయ ఆరోగ్య సేవలు ప్రారంభమైన 70వ ఏట ఎన్​హెచ్​ఎస్​ పార్లమెంటరీ అవార్డ్‌ను ఏర్పాటు చేశారు. ఎన్​హెచ్​ఎస్​ సహా.. వ్యక్తిగతంగా పెద్దఎత్తున వైద్యసేవలు అందించిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఎన్​హెచ్​ఎస్ జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో షార్ట్‌లిస్ట్​ అయిన ఏడుగురిలో డాక్టర్‌ ఘట్టమనేని హనుమంతరావు ఒకరు.

డాక్టర్​ ఘట్టమనేని హనుమంతరావు

తెలుగు వ్యక్తే

కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన హనుమంతరావు.. కర్నూలులో వైద్య విద్య అభ్యసించారు. ఛండీగఢ్​లో రేడియోథెరఫీ విభాగంలో ఎండీ పూర్తిచేశారు. ఆ తర్వాత మాంచెస్టర్‌లోని క్రిస్టీ ఆస్పత్రిలో శిక్షణ పొందారు. ప్రఖ్యాత కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిస్టీ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తూనే.. ఎఫ్​ఆర్​సీఆర్​ పట్టా తీసుకున్నారు.

ఇదీ చదవండి:ప్రముఖ ప్రవాస భారతీయ​ ఫిజీషియన్​ లోధా మృతి

Last Updated : Nov 24, 2020, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details