ప్రపంచ ప్రసిద్ధ 'బీర్ ఫెస్టివల్' జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో శనివారం ప్రారంభమైంది. ఈ వేడుకలు అక్టోబర్ 6 వరకు కొనసాగుతాయి. ఈ బీర్ల పండగలో ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 6 మిలియన్ల మంది సందర్శకులు పాల్గొంటారు.
జర్మనీలో ఈ పండగను 'ఆక్టోబర్ ఫెస్ట్'గా పేర్కొంటారు. ప్రస్తుతం జరుగుతున్నది 186వ బీర్ ఫెస్టివల్. వేడుకల్లో సంప్రదాయబద్ధంగా తొలి పెగ్‌ని బవేరియన్ ప్రధానమంత్రి మార్కస్ సోడర్ ఆస్వాధించారు.
"అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలు తాము కోరుకుంటున్న ఆనందాన్ని, ఉపశమనాన్ని ఈ ఆక్టోబర్ ఫెస్ట్‌లో పొందుతారని ఆశిస్తున్నాను. సందర్శకులు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోతున్నప్పుడు.. బవేరియా మా సొంత ఇళ్లులానే ఉంది అని అనుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఈ బీర్ పండగను నిజమైన బవేరియన్లలా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను."