తెలంగాణ

telangana

ETV Bharat / international

'కొవాక్స్​'కు టీకాల సరఫరా- భారత్​పై డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు!

ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు అందించాలనే లక్ష్యంతో 'కొవాక్స్'​కు(covax vaccine india) టీకాల సరఫరాను పునరుద్ధరిస్తామని భారత్​ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అది తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు టెడ్రోస్​ అధనోమ్​(world health organization president).

WHO DG Tedros Adhanom
డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​

By

Published : Sep 22, 2021, 9:14 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో 'కొవాక్స్​'కు కొవిడ్​-19 వ్యాక్సిన్ల(covax vaccine india) సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన భారత్​పై ప్రశంసలు కురిపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అది ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడుతుందని తెలిపింది.

ఈ మేరకు భారత వైద్య, ఆరోగ్య మంత్రి మాన్సుఖ్​ మాండవియాకు కృతజ్ఞతలు తెలిపారు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ గెబ్రెయెసస్(world health organization president). ​

" కొవాక్స్​ కీలకమైన కొవిడ్​ వ్యాక్సిన్​ సరఫరాను వచ్చే అక్టోబర్​లో భారత్​ పునరుద్ధరిస్తుందని ప్రకటించిన ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్​ మాండవియాకు నా కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని 40 శాతం మంది ప్రజలకు ఈ ఏడాది చివరి నాటికి టీకా అందాలనే లక్ష్యానికి మద్దతుగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. "

- టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​

వ్యాక్సిన్​ మైత్రిలో భాగంగా..

కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి(vaccine maitri) అండగా నిలిచింది భారత్​. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు(vaccine maitri) అందించాలని నిర్ణయించింది. భారత్​లో అదనంగా ఉన్న కొవిడ్​ టీకాలను 'వ్యాక్సిన్​ మైత్రి'(vaccine maitri) కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయా సెప్టెంబర్​ 20న ప్రకటించారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. అయితే.. దేశ పౌరులకు వ్యాక్సిన్(india vaccine news)​ వేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'వచ్చే నెల నుంచి విదేశాలకు భారత్​ టీకా సాయం'

ABOUT THE AUTHOR

...view details