ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు డబ్ల్యూహెచ్ఓ శ్రమిస్తూనే ఉంటుందని తెలిపారు. అతి తక్కువ సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేసి, పంపిణీ చేయటంపై శాస్త్రవేత్తలను ప్రశంసించారు. దీనిని 'అద్భుతమైన సాంకేతిక విజయం'గా అభివర్ణించారు.
'అందరికీ వ్యాక్సిన్ అందేంత వరకు విశ్రమించం' - కరోనా స్ట్రెయిన్
ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) శ్రమిస్తూనే ఉంటుందని ఆ సంస్థ డెరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పష్టం చేశారు. వైరస్ ప్రబలిన సంవత్సరంలోనే వ్యాక్సిన్ తయారు చేసి, పంపిణీ చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది 'అద్భుతమైన సాంకేతిక విజయం' అని శాస్త్రవేత్తలను కొనియాడారు.
'అన్ని దేశాలకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు శ్రమిస్తాం'
కరోనా స్ట్రెయిన్ కారణంగా 2021లో కొత్త సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు టెడ్రోస్. కొత్త రకం కరోనా వైరస్‌పై శాస్త్రవేత్తలతో కలిసి డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తుందని తెలిపారు. బ్రిటన్లానే ఇతర దేశాల్లోనూ కరోనా స్ట్రెయిన్‌పై పరీక్షలను కొనసాగించాలని సూచించారు.
ఇదీ చదవండి :'90శాతం దేశాల్లో ఆరోగ్య సేవలపై 'కరోనా' ఎఫెక్ట్'