తెలంగాణ

telangana

ETV Bharat / international

మహాత్ముడి కళ్లజోడు వేలం.. ఎంత పలికిందంటే? - Spectacles of mahathma gandi

గాంధీ అనగానే గుండ్రటి అద్దాలు.. బంగారు పూత పూసిన కళ్లజోడుతో బోసినవ్వులు చిందిస్తున్న ఆయన ముఖమే కళ్లముందు కదలాడుతుంది. అవి లేని గాంధీ చిత్రపటం కనపడటం చాలా అరుదు. ఆ స్థాయిలో ప్రసిద్ధికెక్కాయి ఆ అద్దాలు. మరి, ఆయన ధరించిన ఆ అద్దాలను వేలం వేస్తే..? అవును, ఆనాటి గాంధీ కళ్లజోడును ఇప్పడు బ్రిటన్.. అంతర్జాతీయ​ వేలంపాటలో పెట్టింది. మరి, స్పందన ఎలా ఉందో తెలుసా?

spectacles-believed-to-be-worn-by-gandhi-emerge-at-uk-auction
మహాత్ముడి కళ్లజోడు వేలం వేస్తే...

By

Published : Aug 10, 2020, 9:53 AM IST

మహాత్మా గాంధీ ధరించిన కళ్లజోడును వేలం వేసింది ఇంగ్లండ్​కు చెందిన ఈస్ట్ బ్రిస్టల్ వేలం సంస్థ. ఓ ఉత్తరాల డబ్బాలో వెలికితీసిన ఈ కళ్ళజోడు వెనుక ఇంత గొప్ప చరిత్ర ఉంటుందని ఊహించలేదు అంటున్నారు అధికారులు. ఈ కళ్లజోడును వేలానికి పెట్టగానే భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి విపరీతమైన స్పందన లభించిందని వారు తెలిపారు.

గాంధీవేనా..?

గాంధీ ధరించారంటూ... విస్తృత ప్రచారం జరుగుతున్న ఈ కళ్లజోడును సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ కుటుంబం వేలం పాట సంస్థకు పంపింది. 1910-1920 ప్రాంతంలో తమ కుటుంబంలోని ఓ వ్యక్తి సౌత్ ఆఫ్రికా పెట్రోలియంలో పని చేస్తున్నపప్పుడు అతడికి ఈ కళ్లజోడు గాంధీ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. అయితే, 1920 నాటికి గాంధీ కళ్లకు అద్దాలు పెట్టుకున్నారా లేదా అనేది స్పష్టం కాలేదు.

అయితే, ఇప్పటికే ఆన్​లైన్ వేలంపాటలో ఈ కళ్లజోడు రూ.5 లక్షల 88 వేలు (6 వేల పౌండ్లు) పలుకుతోంది. ఇది బాపూజీ కళ్లజోడని తేలితే భారత కరెన్సీ ప్రకారం రూ.9 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు సంస్థ అధికారులు.

ఇదీ చదవండి: తల్లి పాలతో కరోనా సోకదు.. కానీ జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details