తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి కన్నుమూత.. వయసెంతంటే? - ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత

Worlds oldest man dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా భావిస్తున్న డెలా ఫ్యుయెంటె అనే వ్యక్తి మరణించారు. స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారులను ఎదుర్కొని నిలిచిన ఆయన.. మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసెంతంటే?

oldest man dead
oldest man dead

By

Published : Jan 19, 2022, 7:30 AM IST

Worlds oldest man dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన సటుర్నినో డెలా ప్యుయెంటె మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు.

1909లో ఆయన స్పెయిన్​లోని లియోన్ శివార్లలో జన్మించారు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తి ఈయనేనని గిన్నిస్ సంస్థ గతేడాది సెప్టెంబర్​లో ధ్రువీకరించింది.

పదమూడేళ్ల వయసులోనే చెప్పులు కుడుతూ జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయనకు ఎనిమిది మంది పిల్లలు. 14 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండగా.. 22 మంది ముని మనవళ్లు, మనవరాల్లు ఉన్నారు.

ఇదీ చదవండి:హ్యామ్‌స్టర్‌లకు కరోనా.. చంపాలని ప్రభుత్వం నిర్ణయం..

ABOUT THE AUTHOR

...view details