తెలంగాణ

telangana

ETV Bharat / international

స్పెయిన్​లో మంచు బీభత్సం.. స్తంభించిన జనజీవనం

ఆదివారం రాత్రి కురిసిన మంచుతో స్పెయిన్​లోని కాస్టిలన్​ రాష్ట్రం అతలాకుతలమయింది. రోడ్లపై మంచు దట్టంగా పేరుకుపోవడం వల్ల... తక్షణ సహాయక చర్యలు చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది. భారీ యంత్రాలతో మంచును తొలగిస్తున్నారు.

spain snow
స్పెయిన్​లో మంచు బీభత్సం... స్తంభించిన జనజీవనం

By

Published : Jan 21, 2020, 11:44 PM IST

Updated : Feb 17, 2020, 10:41 PM IST

స్పెయిన్​లోని కాస్టిలన్​ రాష్ట్రంలో నిన్న రాత్రి అకస్మాత్తుగా కురిసిన మంచు వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై దట్టమైన మంచు అడుగుల మేర పేరుకుపోయింది. దాదాపు 80 సెంటిమీటర్ల మంచు వర్షపాతం నమోదైంది. రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు ఎటూకదలలేని పరిస్థితి ఏర్పడింది.

రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు.

నష్టం...

3 రోజుల నుంచి నిరంతరంగా కురుస్తోన్న మంచు వర్షం వల్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రోడ్లన్నీ మూసుకుపోయాయి. విద్యుత్తు​ నిలిచిపోవడం వల్ల దాదాపు 2లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మంచు ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

స్పెయిన్​లో మంచు బీభత్సం.. స్తంభించిన జనజీవనం

ఇదీ చూడండి : 'కరోనా'పై అలర్ట్​.. 7 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు​

Last Updated : Feb 17, 2020, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details