తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్ష కేంద్రం చేరిన రష్యా మానవ రోబో

సోయుజ్​-14 వ్యోమనౌక ద్వారా రష్యా రోదసిలోకి పంపిన మానవాకార రోబో విజయవంతంగా ఐఎస్​ఎస్​తో అనుసంధానమైంది. ఐఎస్​ఎస్ వ్యోమగాములకు తోడుగా రష్యా ఈ రోబోను పంపింది.

అంతరిక్ష కేంద్రం చేరిన రష్యా మానవ రోబో

By

Published : Aug 27, 2019, 2:18 PM IST

Updated : Sep 28, 2019, 11:20 AM IST

అంతరిక్ష కేంద్రం చేరిన రష్యా మానవ రోబో

రష్యా గురువారం సోయుజ్​-14 వ్యోమ నౌక ద్వారా రోదసిలోకి పంపిన ఒక హ్యూమనాయిడ్​ రోబో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం​లోకి విజయవంతంగా చేరుకుంది. భూకక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)లోని వ్యోమగాములకు తోడుగా ఈ రోబోను పంపింది రష్యా.

శనివారమే ఈ రోబో ఐఎస్​ఎస్ చేరుకోవాల్సి ఉండగా... చిన్నపాటి సమస్యల కారణంగా నిలిపేశారు. ఫెడోర్​గా పిలిచే ఈ మరమనిషి అక్కడే 10 రోజులపాటు గడిపి, వ్యోమగాములకు సాయం చెయ్యడంపై శిక్షణ పొందుతుంది. రష్యా ఇలా రోబోను పంపడం ఇదే తొలిసారి.

గతంలోనూ రోబో ప్రయోగాలు...

ఫెడోర్​ కంటే ముందు నాసా 2011లో జనరల్​ మోటార్స్​తో అభివృద్ధి చేసిన రోబోనాట్​ 2 అనే హ్యూమనాయిడ్​ రోబోను పంపింది. అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలోనూ పనిచేయగలిగే విధంగా దానిని రూపొందించారు. 2018లో సాంకేతిక కారణాల వల్ల భూమికి తిరిగి వచ్చింది. 2013లో జపాన్​ ఓ చిన్న రోబోను రోదసిలోకి పంపింది.

ఇదీ చూడండి:బురదకాలువలో అంతర్జాతీయ ఈత పోటీలు

Last Updated : Sep 28, 2019, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details