బ్రిటన్‌లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తోంది. అక్కడి ఆసుపత్రుల్లో కరోనా రోగులకు పడకలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు ప్రస్తుతానికి నిలిపివేసి.. కేవలం కరోనా రోగులకే చికిత్స అందిస్తున్నారు.
అయితే ఆస్ట్రాజెనెకా- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి త్వరలో అనుమతి లభిస్తుందని సమాచారం.
దక్షిణ కొరియాలో కొత్త రకం కరోనా
దక్షిణ కొరియాలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేపింది. యూకే నుంచి వచ్చిన ముగ్గురిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీళ్లు క్వారంటైన్లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ కంటే దాదాపు 70శాతం వేగంతో ఈ స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో 57,680 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 819 మంది మరణించారు.