తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్​ఐవీ మాయం! - లండన్​

స్టెమ్​ సెల్​ మార్పుతో హెచ్​ఐవీ నుంచి బయటపడ్డాడో లండన్ వ్యక్తి. రోగ నిరోధక శక్తి పెంచే పద్ధతి ద్వారా ఇది సాధ్యమైంది.

హెచ్​ఐవీ

By

Published : Mar 5, 2019, 10:36 AM IST

స్టెమ్​ సెల్​ మార్పు తర్వాత లండన్​కు చెందిన ఓ వ్యక్తి హెచ్​వీఐ బారి నుంచి బయటపడ్డాడని పరిశోధకులు ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతమై ప్రాణాంతక వైరస్​ నుంచి విముక్తి పొందిన రెండో వ్యక్తి ఇతడని తెలిపారు .

ఈ విషయాన్ని ఆన్​లైన్​ పత్రిక​ 'నేచర్'​ ప్రచురించింది.

ఇప్పుడు హెచ్​ఐవీ నుంచి బయటపడిన లండన్​ వ్యక్తికి... 2003లో ఆ వైరస్​ సోకింది. క్యాన్సర్​ కూడా వచ్చింది. క్యాన్సర్​ చికిత్స కోసం స్టెమ్​ సెల్స్​ మార్చుకునేందుకు 2016లో అతడు అంగీకరించాడు.

అతడికి చికిత్స చేస్తున్న వైద్యులు ఇది వరకే జన్యుమార్పిడి జరిగిన ఓ దాతను వెతికిపట్టుకున్నారు. అతడి కణాలను లండన్​ వాసికి మార్చారు. ఈ మార్పు హెచ్​ఐవీ బాధితుడిలోని రోగ నిరోధక వ్యవస్థను మార్చేసింది. దాతకు ఉన్న రోగ నిరోధక శక్తి ఇతడికి వచ్చింది. హెచ్​ఐవీ నుంచి విముక్తుడయ్యాడు.
అయితే ఇలాంటి కణాల మార్పు చాలా ప్రమాదకరమని, చాలా మందికి ఈ ప్రయోగం విఫలమైందని పరిశోధకులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details