Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. రెండు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. అంతకుముందు చేసిన దాడులతో ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. కీవ్ నగరంపై రష్యా సైనలు బాంబుల వర్షం కురిపించాయి. పౌరులు ఉంటున్న ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకున్నాయి.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు 'ఈనాడు-ఈటీవీ భారత్'కు అందాయి. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు వడీం ఇచెంకో తమ దేశంలోని భీతావహ పరిస్థితిని వివరించారు. ఫొటోలను, వీడియోలను అందించి.. అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టేలా తెలియజేశారు.
సైన్యానికి పౌరుల అండ..
రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తమ దేశ సైన్యానికి అండగా నిలుస్తున్నారు ఉక్రెయిన్ పౌరులు. ఇప్పుడు విదేశాల్లోని వారు సైతం స్వదేశానికి చేరుకుంటున్నారు. రష్యాపై పోరాడేందుకు సుమారు 66,224 మంది విదేశాల్లోని ఉక్రెయిన్ పౌరులు మాతృ దేశానికి తిరిగివచ్చినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్ తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.