తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా: అబ్బురపరిచిన ఆకాశ విన్యాసాలు - sky shows

రక్షణశాఖ ఆధ్వర్యంలో రష్యాలో ఎయిర్​ ఫెస్టివల్​ పేరిట ఆకాశంలో అద్భుతమైన పోటీలు జరిగాయి. వీటిని చూసేందుకు రష్యన్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

రష్యా: అబ్బురపరిచిన ఆకాశ విన్యాసాలు

By

Published : Aug 14, 2019, 7:17 AM IST

Updated : Sep 26, 2019, 10:47 PM IST

రష్యా: అబ్బురపరిచిన ఆకాశ విన్యాసాలు

ఆకాశంలో ఎగిరే ఎయిర్​ జంపర్లకు​ 'ఎయిర్​ ఫెస్టివల్'​ పేరిట రష్యాలో పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు చాలా మంది పోటీదారులు వచ్చారు. పారాచూట్​ జంపర్లు విమానంలో దాదాపు 1200 అడుగుల ఎత్తు నుంచి దూకి విన్యాసాలు చేశారు. జంపర్లు చేసిన సాహసాలు చూపరులను ఆశ్చర్యానికి గురిచేశాయి.

'చాలా ఎత్తు నుంచి దూకాను. అంత ఎత్తు నుంచి దూకినప్పుడు దూరాన్ని, ఎప్పుడు లాండ్​ అవ్వాలి అనేది చాలా జాగ్రత్తగా ఊహించాలి. ఆడ, మగ ఎవరైనా మొదటిసారి పారాచూట్​ జంపింగ్​ చేస్తే ఆ అనుభవాన్ని ఎప్పటికి మరిచిపోలేరు.

-ఆర్తర్​ ముస్తఫిన్​, పారాచూట్​ పోటీదారుడు

రష్యా రక్షణశాఖ​ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ జంపింగ్​లో సైనికులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్​లో చిన్న చిన్న విమానాలు, పారా గిల్డర్స్​ను ప్రయోగించారు. చిన్న విమానాలు ఆకాశంలో ఎగురుతూ వీక్షకుల కళ్లను కట్టిపడేశాయి. పారా గిల్డర్స్​ ఎటువంటి ఇంజిన్​, పరికరం సహాయం లేకుండా ఎగరటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

చిన్నప్పటి నుంచి ఆకాశం గురించి కలలు కంటారు. జన్యు పరంగా, మానసికంగా అంతరిక్షం గురించి ఆలోచించడం మెదలుపెట్టారు.

-ఆర్కడై, సైన్యాధ్యక్షుడు


Last Updated : Sep 26, 2019, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details