ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నవారిలో అదనంగా రక్తం గడ్డకట్టే ముప్పు ఉండదని బ్రిటన్‌కు చెందిన ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ధ్రువీకరించింది. భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఈ టీకాను తయారు చేస్తోంది.
పలు దేశాలు వెనకడుగు..
ఆస్ట్రాజెనెకా తొలిడోసు వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో స్వల్పంగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్ పడిపోవడం (థ్రోంబో సైటోపెనియా సిండ్రోమ్‌తో కూడిన థ్రోంబోసిస్-టీటీఎస్) తలెత్తుతున్నట్టు గుర్తించారు. దీంతో పలు దేశాలు ఈ టీకా వినియోగంపై వెనకడుగు వేస్తున్నాయి.
ఈ సమస్యపై దృష్టి సారించిన ఎంహెచ్‌ఆర్‌ఏ.. తొలి, మలి డోసు తీసుకున్న ఎంతమందిలో టీటీఎస్ తలెత్తుతోందన్న దానిపై అధ్యయనం సాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలు, టీకాల కారణంగా చాలమందిలో టీటీఎస్ తలెత్తుతోందన్న ఆరోగ్య భద్రత వివరాలను విశ్లేషించింది.
10 లక్షల మందిలో..