Queen Elizabeth Tested Positive: బ్రిటన్ రాణి ఎలిజబెత్-II కరోనా బారినపడ్డారు. ఆమెకు తేలికపాటి జలుబు వంటి కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఎలిజబెత్.. విండ్సర్ క్యాజిల్‌లోని తన నివాసంలోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే కొద్దిరోజుల పాటు విధులను పరిమితం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు.
''బ్రిటన్ రాణి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ.. అన్ని కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తారు.''
- బకింగ్‌హామ్ ప్యాలెస్