ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. అల్బేనియాలో ప్రధాన మంత్రి ఎడా రామా తక్షణమే వైదొలగి, ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు ఆందోళనకు దిగారు. రాజధాని టిరానాలో ప్రధాని కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కొందరు గాయపడ్డారు.
సోషలిస్ట్ పార్టీ నేత, ప్రధాని ఎడీ రామా అవినీతికి పాల్పడ్డారన్నది ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణ.
వివిధ దేశాల్లో నిరంకుశత్వంపై ప్రజాగ్రహం! - సెర్బియా
వివిధ దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. అల్బేనియాలో ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకం అయ్యాయి. సెర్బియాలోనూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు నిరసన చేపట్టారు.
వివిధ దేశాల్లో నిరంకుశత్వంపై ప్రజాగ్రహం!
సెర్బియాలోనూ...
సెర్బియాలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వ్యుచిచ్కు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు చేపట్టారు. బెల్గ్రేడ్లోని పార్లమెంటు భవనం ఎదుట ఆందోళనకు దిగారు. అలెగ్జాండర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు.