తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా వేదికగా నాయక్​కు ఉచ్చు బిగించిన మోదీ - నరేంద్ర మోదీ

వివాదాస్పద మత బోధకుడు జకీర్​ నాయక్​కు రష్యా వేదికగా ఉచ్చు బిగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మలేషియా ప్రధానితో భేటీ సందర్భంగా జకీర్​ను భారత్​కు అప్పగించే అంశంపై చర్చించారు. ఈడీ విచారణను తప్పించుకునేందుకు ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్నారు జకీర్​.

రష్యా వేదికగా నాయక్​కు ఉచ్చు బిగించిన మోదీ

By

Published : Sep 5, 2019, 10:03 AM IST

Updated : Sep 29, 2019, 12:22 PM IST

రష్యా వేదికగా నాయక్​కు ఉచ్చు బిగించిన మోదీ

మనీలాండరింగ్​ ఆరోపణలు ఎదుర్కొంటూ, విదేశాలకు పరారైన వివాదాస్పద ఇస్లామిక్​ ప్రబోధకుడు జకీర్​ నాయక్​కు ఉచ్చు బిగిస్తోంది భారత్​. రష్యా వేదికగా మలేషియా ప్రధాని మహతిర్​ బిన్​ మహ్మద్​తో భేటీ సందర్భంగా జకీర్​ అంశాన్ని లేవనెత్తారు ప్రధాని మోదీ. జకీర్​ను భారత్​కు అప్పగించే అంశంపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు.

"జకీర్​ నాయక్​ అప్పగింత అంశాన్ని ప్రధానమంత్రి మోదీ లేవనెత్తారు. ఈ విషయానికి సంబంధించి ఇరు దేశాల అధికారులు సంప్రదింపులు జరపాలని నేతలు ఇద్దరూ నిర్ణయించారు. ఇది ఒక ముఖ్యమైన సమస్యగా పేర్కొన్నారు."

- విజయ్​ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి

ఇటీవలే జకీర్​ నాయక్​పై రెడ్​కార్నర్​ నోటీసుల జారీలో ఆలస్యంపై ఇంటర్​పోల్​ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది భారత్​. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తాజాగా మలేషియా ప్రధానితో భేటీలో జకీర్​ అంశాన్ని ప్రస్తావించటం... జకీర్​పై చర్యలకు కేంద్రం పట్టుదలతో ఉన్నట్లు తెలియచేస్తోంది.

మలేషియాలో..

ఓ వర్గం యువతను తీవ్రవాదం వైపు దారిమళ్లిస్తున్నారని జకీర్​పై ఆరోపణలున్నాయి. ఆయనకు అక్రమ మార్గంలో కోట్లాది రూపాయల విరాళాలు అందినట్లు ఎన్​పోర్స్​మెంట్ డైరెక్టరేట్​ గుర్తించింది. జకీర్​ ప్రసంగాలకు ఆకర్షితులై యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్​, కువైట్​, ఒమన్​, మలేసియా వంటి దేశాల నుంచి కొందరు భారీగా నిధులు పంపినట్లు పేర్కొంది.

ఈడీ విచారణను తప్పించుకునేందుకు ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్నారు జకీర్​.

ఇదీ చూడండి: జకీర్​ నాయక్​ ఖాతాల్లో కోట్లాది అక్రమ నిధులు

Last Updated : Sep 29, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details