కరోనా సమయంలో ఆయా ప్రభుత్వాల నిబంధనలను పాటించే విషయంలో సమాజం ఎలా ప్రభావితమైందనే అంశంపై.. యూకేకు చెందిన నాటింగ్హామ్ విశ్వ విద్యాలయ పరిశోధకులు సర్వే నిర్వహించారు. కరోనా కాలంలో అనుభవాలను వెల్లడించాల్సిందిగా వందకు పైగా దేశాలలో పలువురిని సర్వే చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజలు సొంత ఆలోచనల కంటే.. వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏ విధానాలు అనుసరించారో.. వాటినే అనుకరించారని ఆ అధ్యయనం తెలిపింది.