రెండోసారి కరోనా విజృంభిస్తున్న వేళ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో తిరిగి లాక్‌డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది. కొత్త తరహా కరోనా కేసుల నేపథ్యంలో వ్యాధిగ్రస్థులతో ఐసీయూలు నిండుతుండటం సహా టీకా సరఫరా తగ్గిపోగా.. ఈ మేరకు లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థ అధిపతి జెరోమ్ సలోమన్ తెలిపారు. ప్రస్తుతం పారిస్ పరిసర ప్రాంతంలో పరిస్థితి క్లిష్టంగా మారుతోందని చెప్పారు.
మరోసారి లాక్‌డౌన్ దిశగా పారిస్!
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కరోనా విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నారు అక్కడి అధికారులు. వైరస్ కట్టడికి ఈ తరహా కఠిన చర్యలు అవసరమని వారు భావిస్తున్నారు.
మరోసారి లాక్‌డౌన్ దిశగా పారిస్!
దేశంలోని పలుచోట్ల వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్ కట్టడికి కర్ఫ్యూ ఏ మాత్రం సరిపోదని సలోమన్ పేర్కొన్నారు. పారిస్‌లో కేసులు పెరుగుతున్నందున తక్కువ తీవ్రత ఉన్న ప్రాంతాలకు వ్యాధిగ్రస్థులను తరలిస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 40 లక్షల మందికిపైగా కొవిడ్ బారిన పడగా.. 90 వేల 315 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:ఐర్లాండ్‌లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేత