పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు. వందకు పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్యారిస్‌లో 10 వేల మంది, దేశవ్యాప్తంగా 32 వేల మంది నిరసనల్లో పాల్గొన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్టోఫ్ కాస్టానర్ తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు నేటితో 18 వారాలకు చేరుకున్నాయి.
వాతావరణ మార్పులపై ర్యాలీ
పచ్చకోటు నిరసనలతో ప్యారిస్ అట్టుకుడిపోతుంటే అదే సమయంలో వాతావరణ మార్పులపై శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు నగరవాసులు. ఒపెరా గార్నియర్ నుంచి రిపబ్లిక్ ప్లాజా వరకు నిర్వహించిన ర్యాలీలో సుమారు 30 వేల మంది పాల్గొన్నారు. వీరిలో సినిమా తారలు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. దీనిపై స్పందించిన మేక్రాన్.. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:భూతాపంపై విద్యార్థి లోకం గర్జన