తెలంగాణ

telangana

ETV Bharat / international

'మరణించినా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగిస్తున్నాం' - బ్రెజిల్ కొవిడ్ టీకా వలంటీర్ మృతి

తమ టీకా వేయించుకున్న వాలంటీర్ మరణించినప్పటికీ బ్రెజిల్​లో వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం. స్వతంత్ర దర్యాప్తు బృందం, బ్రెజిల్ రెగ్యులేటరీ.. ట్రయల్స్ కొనసాగించాలనే సిఫార్సు చేశాయని పేర్కొంది.

Oxford vaccine trial continues amid death report
'మరణించినా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగిస్తున్నాం'

By

Published : Oct 22, 2020, 7:37 PM IST

Updated : Oct 22, 2020, 7:48 PM IST

టీకా స్వీకరించినవారిలో ఒకరు మరణించినప్పటికీ బ్రెజిల్​లో కరోనా వ్యాక్సిన్ చివరి విడత ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. మరణానికి టీకానే కారణమన్న విషయాలేవీ స్వతంత్ర దర్యాప్తులో తేలలేదని పేర్కొంది. నిర్దిష్ట సంఘటనలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని స్పష్టం చేసింది.

స్వతంత్ర దర్యాప్తు బృందంతో పాటు, బ్రెజిల్ రెగ్యులేటరీ ట్రయల్స్ కొనసాగించాలనే సిఫార్సు చేశాయని ఆక్స్​ఫర్డ్ తెలిపింది.

సురక్షితమే

ఆక్స్​ఫర్డ్ టీకా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్​ అంతా సవ్యంగానే జరుగుతున్నాయని.. వ్యాక్సిన్ సురక్షతపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టిన బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన బృందం పేర్కొంది. వైరస్ వ్యతిరేక పోరులో ఇదో శుభవార్త అని తెలిపింది. జన్యు సూచనలను టీకా పక్కా అనుసరిస్తోందని స్పష్టతనిచ్చింది.

ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి ఈ టీకాను ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తోంది. అమెరికా, యూకే, బ్రెజిల్ తదితర దేశాల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఇదీ చదవండి-బ్రెజిల్​లో కొవిడ్‌ టీకా వాలంటీరు మృతి!

Last Updated : Oct 22, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details