తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండు వేర్వేరు టీకాలు మిక్స్​ చేస్తే ఏమవుతుంది? - robust immune responses

వ్యాక్సినేషన్​లో భాగంగా.. ఫస్ట్​ డోస్​, రెండో డోసు వేర్వేరు టీకాలు తీసుకుంటే ఏమవుతుంది? రెండు వేర్వేరు కరోనా టీకాలను ఇవ్వడం(వ్యాక్సిన్‌ మిక్సింగ్‌) ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తితో పాటు కొత్త వేరియంట్ల నుంచి రక్షణ ఇచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి పరిశోధకులు ఏమంటున్నారు?

mixing COVID-19 vaccines
వ్యాక్సిన్​ మిక్సింగ్​

By

Published : Jun 29, 2021, 11:07 AM IST

Updated : Jun 29, 2021, 12:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కొరత నేపథ్యంలో.. కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. రెండు వేర్వేరు డోసులు ఇవ్వొచ్చా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.

రెండు వేర్వేరు డోసులుగా.. ఆస్ట్రాజెనెకా, ఫైజర్​-బయోఎన్​టెక్​ టీకాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగు పడుతుందని తెలిపింది. కరోనా వైరస్​ను ఎదుర్కొనే విధంగా.. బలమైన రోగనిరోధన ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తుందని వివరించింది.

4 వారాల వ్యవధిలో..

ఈ అధ్యయనం ప్రకారం.. రెండు వేర్వేరు టీకా డోసులను నాలుగు వారాల వ్యవధిలో ఇస్తే, సార్స్​- కొవ్2కు వ్యతిరేకంగా.. అధిక సాంద్రత గల యాంటీబాడీలను సృష్టిస్తోందని పేర్కొన్నారు పరిశోధకులు.

''కరోనాపై అధ్యయనంలో.. ఈ డేటా కీలక ముందడుగుగా చెప్పొచ్చు. రెండు వేర్వేరు టీకాలతో.. కొవిడ్​-19ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని బాధితులు నాలుగు వారాల్లోనే పొందొచ్చు.''

- జొనాథన్​, యూకే డిప్యూటీ చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​

మామూలుగా ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా టీకా రెండు డోసులను.. 8 నుంచి 12 వారాల వ్యవధిలో వేస్తున్నారని, ఈ టీకాల మిక్సింగ్​తో ఆ వ్యవధి బాగా తగ్గుతుందని తెలిపారు ప్రొఫెసర్​ స్నేప్​.

టీకా కొరతకు పరిష్కారం..

ప్రస్తుతం దేశంలో జనాభా అవసరాలకు తగ్గట్లు వ్యాక్సిన్ ఉత్పత్తి జరగడం లేదు. పలు దేశాల్లో టీకా పంపిణీ 5శాతం కూడా పూర్తికాలేదు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి డోసు తీసుకున్న వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే.. రెండో డోసు వేరే వ్యాక్సిన్ వేసుకొనే అవకాశం ఉంటుంది. తద్వారా టీకా ప్రక్రియ ఆటంకం లేకుండా కొనసాగుతుంది.

ఇంకా బూస్టర్​ డోసును అందించడం కంటే.. రెండు వేర్వేరు టీకాలను ఇవ్వడం ద్వారా.. ఎక్కువ మంది ప్రాణాలను కాపాడగలమా అనే దానిపై అధ్యయనం చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.

జోరుగా వ్యాక్సినేషన్​..

భారత్​లో టీకాల పంపిణీ జోరుగా సాగుతోంది. అమెరికాను దాటి అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు దాదాపు 33 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.

దేశంలో.. ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. విడతల వారీగా కేంద్రం పంపిణీ చేపడుతోంది. తొలి విడతలో ఫ్రంట్​లైన్​ వర్కర్లకు టీకా పంపిణీ చేపట్టగా.. రెండో విడతలో 60ఏళ్లు పైబడిన వారు, 45ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ల పంపిణీ చేపట్టింది. మూడో విడతలో 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా అందిస్తోంది.

ఇవీ చదవండి: టీకా మిక్సింగ్‌తో లాభమా? నష్టమా?

దేశంలో 40వేల దిగువకు కరోనా కేసులు

వ్యాక్సినేషన్​లో అమెరికాను దాటిన భారత్

Last Updated : Jun 29, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details