రెండు మోతాదుల్లో తీసుకోవాల్సిన ఆక్స్ఫర్డ్ 'ఆస్ట్రాజెనెకా' కరోనా వ్యాక్సిన్ మొదటి డోసే.. వైరస్ వ్యాప్తిని 67 శాతం నిరోధించగలుగుతున్నట్లు వెల్లడైంది. కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం పేర్కొంది.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ ఫలితాలు 'లాన్సెట్'లో ప్రచురించేందుకు ప్రస్తుతం సమీక్ష జరుగుతోంది. టీకా మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య మూడు నెలల వరకు సమయం ఉన్నా.. అప్పటి వరకు కరోనా సోకకుండా వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు ఈ పరిశోధనలో తెలిసింది.
భారత్‌కు చెందిన సీరమ్‌తో కలిసి ఉత్పత్తి చేస్తున్న.. ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా సింగిల్ స్టాండర్డ్ డోస్ 76 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయం తెలిపింది. ఈ టీకా మొదటి డోసు వేసుకున్న తర్వాత 22వ రోజు నుంచి 90వ రోజు వరకు దాని సామర్థ్యంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.