తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2021, 6:45 AM IST

ETV Bharat / international

జాత్యాహంకారానికి తావులేదు: బ్రిటన్

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు అమెరికాలోని పాపులర్ టీవీ షోకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రిటన్​ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత తాను చాలా ఇబ్బందులు పడిన్నట్లు తెలిపారు.

no-place-for-racism-in-our-society
జాత్యాహంకారానికి తావులేదు: బ్రిటన్

తమ దేశంలో జాత్యాహంకారానికి చోటులేదని బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు అమెరికాలోని పాపులర్ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూ నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. ప్రిన్స్‌ హ్యరీని పెళ్లి చేసుకొని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని మేఘన్ వెల్లడించారు. గర్భవతిగా ఉన్న సమయంలో బిడ్డ రంగు గురించి చర్చ జరిగిందని, నల్లగా పుడతాడనే ఆందోళన వ్యక్తమైందని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ క్రమంలో 'తమ సమాజంలో జాత్యాహంకారానికి ఏ మాత్రం తావు లేదు' అని బ్రిటన్ మంత్రి విక్కీ ఫోర్డ్ మీడియాతో వ్యాఖ్యానించారు. అలాగే తానింతవరకు ఆ ఇంటర్వ్యూను చూడలేదని కూడా చెప్పారు. కాగా, రాజకుటుంబంతో విభేదాల కారణంగా హ్యారీ దంపతులు తమ హోదాలను వీడి, అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.

బోరిస్​ నో కామెంట్​..

హ్యారీ, మేఘన్​ దంపతుల జాత్యాహంకార వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ నిరాకరించారు. రాజకుటుంబానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నతమైన విలువ ఉందని ప్రధాని పేర్కొన్నారు. వారి అంతర్గత విషయాలపై మాట్లాడేందుకు విముఖత చూపించారు.

ఇదీ చూడండి: 'సింధియా.. భాజపాలో ఎప్పటికీ సీఎం కాలేరు'

ABOUT THE AUTHOR

...view details