ఐరోపాలో చాలామంది ట్రక్ డైవర్లు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పండుగ వేళ ఆనందంగా ఇంటి వద్ద గడపాల్సిన వారు.. బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వైరస్ కారణంగా సరిహద్దుల వద్దనే ఉండిపోతున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్‌తో ఫ్రాన్స్ పాక్షికంగా సరిహద్దులను మూసివేసింది. దీంతో అధికారులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. కరోనా నెగటివ్ రిపోర్టుతో మాత్రమే వాహన చోదకులను దేశం లోపలికి అనుమతిస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది డ్రైవర్లు క్రిస్మస్ పండుగకు వెళ్లలేక మాస్ గ్రిడ్‌లాక్‌లో చిక్కుకున్నారు.
క్రిస్మస్ వేడుకలకు దూరంగా ట్రక్ డ్రైవర్లు - క్రిస్మస్ వేడుకలు యూరప్
కొత్త వైరస్ కారణంగా ఐరోపాలో ట్రక్ డ్రైవర్లు ఈ క్రిస్మస్ వేడుకులకు దూరంగా ఉండనున్నారు. మహమ్మారి కట్టడి విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం సరిహద్దులను పాక్షికంగా మూసివేయడం వల్ల చెక్‌పోస్టు వద్ద భారీగా క్యూలు ఏర్పడ్డాయి.
క్రిస్మస్ వేడుకలకు దూరంగా యూరప్ ట్రక్ డ్రైవర్లు
ఈ విధంగా గ్రిడ్‌లాక్‌లో చిక్కుకుపోయినవి సుమారు 8వేల నుంచి 10వేలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ట్రక్కులు ఫ్రాన్స్‌లోకి ప్రవేశించడానికి అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. అయితే వీటిని పూర్తిగా పంపాలి అంటే కొద్ది రోజులు సమయం పడుతుందని తెలిపారు.
ఇదీచూడండి: 'కొత్త' వైరస్ వేళ.. 'క్రిస్మస్'పై ఆంక్షలు ఏ దేశంలో ఎలా?