తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2019, 6:38 AM IST

Updated : Jun 26, 2019, 8:34 AM IST

ETV Bharat / international

జులై 23న బ్రిటన్​ తదుపరి ప్రధాని ఖరారు

జులై 23న బ్రిటన్​ తదుపరి ప్రధాని పేరును ఖరారు చేయనున్నట్టు అధికార కన్జర్వేటివ్​​ పార్టీ ప్రకటిచింది. ప్రధాని పదవి కోసం దౌత్యవేత్త జెరెమి హంట్​, మాజీ విదేశాంగ మంత్రి బారిస్​ జాన్సన్​ మధ్య పోటీ నెలకొంది.

జులై 23న బ్రిటన్​ తదుపరి ప్రధాని ఖరారు

జులై 23న బ్రిటన్​ తదుపరి ప్రధాని ఖరారు

బ్రిటన్​ తదుపరి ప్రధానమంత్రి పేరును జులై 23న ప్రకటించనున్నట్టు అధికార కన్సర్వేటివ్​ పార్టీ వెల్లడించింది. మాజీ విదేశాంగ మంత్రి బారిస్​ జాన్సన్​ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. దౌత్యవేత్త జెరెమి హంట్​తో జాన్సన్​ పోటీపడుతున్నారు.

బ్రిటన్​ పార్లమెంట్​లో బ్రెగ్జిట్​ ఒప్పందం గట్టెక్కని నేపథ్యంలో మే నెలలో థెరెసా మే ప్రధాని పదవికి రాజీనామ చేస్తున్నట్టు ప్రకటించారు.

10లో ఇద్దరు

కన్సర్వేటివ్​ పార్టీ ఎంపీల సంఖ్య 313. వీరిలో ప్రధాని పదవి కోసం తొలుత 10 మందిని ఎంపిక చేశారు. ఈ 10 మందిలో ఇద్దరే పోటీలో నిలిచారు. బ్రిటన్​ తదుపరి ప్రధాని భవితవ్యాన్ని లక్షా 60 వేల మంది పార్టీ సభ్యులు తేల్చనున్నారు.

అప్పటి వరకు మే...

ప్రధానిగా మరో నేత ఎన్నికయ్యేవరకు మే ప్రధాని బాధ్యతల్లో కొనసాగుతారు. అనంతరం క్వీన్​ ఎలిజబెత్​ను కలిసి తన రాజీనామాను సమర్పిస్తారు.

Last Updated : Jun 26, 2019, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details