తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా' భయాలను తొలగించేందుకూ ఓ యాప్! - CORONA FEARS APP

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్.. అనేక మందిని భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది పరిశోధకులు ఓ యాప్​ను అభివృద్ధి చేశారు. మీలో ఉన్న భయాన్ని గుర్తించి.. వాటిని తొలగించేందుకు మీకు సూచనలు, సలహాలు అందిస్తుంది ఈ యాప్.

PANIC MECHANIC
పానిక్ మెకానిక్

By

Published : Apr 7, 2020, 7:30 PM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోన్న వేళ ఆ భయాలను తొలగించేందుకు ఓ సరికొత్త యాప్​ను రూపొందించారు కొంతమంది పరిశోధకులు. బయోఫీడ్ బ్యాక్ సాంకేతికతతో 'పానిక్ మెకానిక్' యాప్​ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా కరోనాపై నెలకొన్న ఆందోళనను నియంత్రించవచ్చని చెబుతున్నారు.

బయో ఫీడ్ బ్యాక్ అంటే ఒక వ్యక్తి చేసే అనేక భౌతిక పనులకు సంబంధించి అవగాహన పొందటం. మీలో భయాన్ని గుర్తించి మీ ఆరోగ్య జాగ్రత్తల గురించి సమాచారం ఇస్తూ ఉంటుంది. పానిక్ మెకానిక్​ను ఎక్కడైనా, ఏ సమయంలోనైనా వినియోగించవచ్చు.

ఇలా పనిచేస్తుంది..

పానిక్ మెకానిక్ యాప్.. ఫోన్​లోని కెమెరా సాయంతో మీ భయాన్ని అంచనా వేస్తుంది. దాన్ని అనుసరించి మీకు సూచనలు చేస్తుంది. వీటితోపాటు మీకు ఎంత నిద్ర, వ్యాయామం అవసరం? ఏం తినాలి? మీలో ఆందోళన స్థాయి ఎంత ఉంది? మత్తు పదార్థాలు, మద్యం సేవిస్తే నష్టం ఏంటి? వంటి విషయాలను తెలియజేస్తుంది.

గత అనుభవాల సమాచారంతో మీలో భయాందోళనలు ఎంతవరకూ ఉంటాయనే విషయాన్ని అంచనా వేస్తుంది ఈ యాప్. వాటిపై మీకు అవగాహన కల్పిస్తుంది.

ఇదీ చూడండి:ఆహారం లభించే వివరాలు ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో!

ABOUT THE AUTHOR

...view details