తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్​ మూర్తి అల్లుడు - అంతర్జాతీయ వార్తలు తెలుగు

బ్రిటన్​లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన అవకాశం దక్కింది. దేశంలో రెండో అతిపెద్ద పదవైన ఆర్థిక మంత్రిగా రుషి సనక్​ నియమితులయ్యారు. బ్రిటన్​ హోంమంత్రి ప్రీతి పటేల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా సనక్ నిలిచారు.

uk fm
రుషి సనక్

By

Published : Feb 13, 2020, 7:19 PM IST

Updated : Mar 1, 2020, 6:00 AM IST

భారత సంతతికి చెందిన రాజకీయ నేత రుషి సనక్​ బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. మంత్రివర్గ పునర్​వ్యవస్థీకరణలో భాగంగా బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. రుషికి చోటు కల్పించారు. బ్రిటన్​ హోంమంత్రి ప్రీతి పటేల్​ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తి రుషి సనక్​.

బ్రిటన్​ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిని దక్కించుకున్న రుషి.. ఇన్ఫోసిస్​ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు కావటం విశేషం.

"ఆర్థిక మంత్రిగా రుషి సనక్​ నియామకాన్ని సంతోషంగా ఆమోదించారు బ్రిటన్ రాణి ఎలిజబెత్​-2."

- బ్రిటన్​ ప్రభుత్వ ప్రకటన

2019 డిసెంబర్​ ఎన్నికల్లో బోరిస్​ భారీ విజయం తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్​ రాజీనామా చేశారు. ఆ స్థానంలో కోశాగార ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రుషిని ఎంపిక చేశారు బోరిస్.

వేగంగా ఎదుగుదల..

కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన రుషి.. బ్రిటన్​ పార్లమెంటుకు 2015లో మొదటిసారి ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్​ విషయంలో బోరిస్​ వ్యూహానికి మద్దతుగా నిలిచి.. వేగంగా రాజకీయాల్లో ఎదిగారు. బ్రిటన్​లో పుట్టిన రుషి సనక్​.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు.

మరి కొంతమందికి..!

బ్రిటన్​లో మరి కొంతమంది మంత్రులు రాజీనామాలు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సంతతి ఎంపీలు ఆలోక్ వర్మ, సువెల్లా బ్రేవర్​మ్యాన్​ తదితరులు కేబినెట్​లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు.

Last Updated : Mar 1, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details