తెలంగాణ

telangana

ETV Bharat / international

భారీ ఉష్ణోగ్రతలకు ఐరోపా ఉక్కిరిబిక్కిరి - వేడికి ఉక్కిరిబిక్కిరి

ఐరోపాలో ఉష్టోగ్రతలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్రాన్స్​లో శుక్రవారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2003లో నమోదైన 44.1 రెండో అత్యధికం. ఆ సమయంలో దాదాపు 15,000 మంది మరణించారు.

ఐరోపా ఉక్కిరిబిక్కిరి

By

Published : Jun 29, 2019, 8:50 AM IST

ఐరోపాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలుభారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్​లో గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉత్తరాఫ్రికా నుంచి వేడిగాలులు వీస్తుండటం వల్ల ఐరోపా అంతటా ఉష్టోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడిగాలులకు స్పెయిన్​లో ఇద్దరు మృతిచెందారు.

2003లో 15వేల మంది మృతి

2003 ఆగస్టులో ఒక్క ఫ్రాన్స్​లోనే అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ సమయంలో సుమారు 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు​.

వేడి నుంచి ఉపశమనం కోసం

ఫ్రాన్స్ రాజధాని పారిస్​లో వేడి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి అనేక మంది ఈఫిల్ టవర్ సమీపంలోని నీటి కొలనును ఆశ్రయించారు. చిన్నారులు ఎంతో ఆహ్లాదంగా గడిపారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలుమాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చూడండి: చంద్రుని శిలలపై నాసా పరిశోధనలు

ABOUT THE AUTHOR

...view details