తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండోసారి లండన్​ కోర్టులో ​మాల్యా అభ్యర్థన - గురువారం

లిక్కర్​ కింగ్​ విజయ్​మాల్యా రెండోసారి లండన్​ కోర్టును ఆశ్రయించారు. తనను భారత్​కు అప్పగించాలన్న బ్రిటన్​ హోంశాఖ ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించారు.

రెండోసారి లండన్​ కోర్టులో విజయ్​మాల్యా అభ్యర్థన

By

Published : Apr 13, 2019, 6:47 AM IST

రెండోసారి లండన్​ కోర్టులో విజయ్​మాల్యా అభ్యర్థన

తనను భారత్​కు తిరిగి పంపించేందుకు అనుమతిస్తూ బ్రిటన్ హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని లండన్​ కోర్టును మరోమారు ఆశ్రయించారు లిక్కర్​ కింగ్​ విజయ్​మాల్యా. రానున్న వారాల్లో మాల్యా అభ్యర్థనపై లండన్​ కోర్టు విచారణ చేపట్టనుంది. మాల్యాపై ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీ, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన వంటి పలు అభియోగాలు ఉన్నాయి.

మాల్యా కేసుల విచారణలో భాగంగా భారతదేశానికి పంపించాలని గత డిసెంబర్​లో వెస్ట్​మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా బ్రిటన్​ హోంశాఖ మాల్యాను భారత్​కు పంపించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై తనకు అప్పీలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఇంతకుముందే ​మాల్యా లండన్​ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 5న ఆ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు జడ్జి ఎదుట క్లుప్తంగా విచారణ చేపట్టడానికి అభ్యర్థన చేయాలనుకుంటే ఐదు పని దినాల్లోగా అప్పీల్​ చేసుకోవాలని సూచించింది.

బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్​మాల్యా 2017 ఏప్రిల్​ నుంచి బ్రిటన్​లో బెయిల్​పై ఉన్నారు.

ఇదీ చూడండి: మాజీ సైనికాధికారుల 'లేఖ'పై దుమారం

ABOUT THE AUTHOR

...view details