భారత్లో మాదిరిగా అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లో వ్యవసాయ రంగానికి వాతావరణ మార్పులు పెద్ద సవాలుగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గ్లాస్గోలో ప్రపంచ వాతావరణ సదస్సు(cop26 summit)లో భాగంగా నిర్వహించిన 'యాక్షన్ అండ్ సాలిడారిటీ - ది క్రిటికల్ డికేడ్' సమావేశంలో మాట్లాడారు.
'ప్రకృతితో మమేకమై జీవించటాన్ని భావితరాలకు నేర్పించాలి'
భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో వాతావరణ మార్పులు.. వ్యవసాయానికి పెద్ద సవాలుగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్గోలో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా నిర్వహించిన 'యాక్షన్ అండ్ సాలిడారిటీ - ది క్రిటికల్ డికేడ్' సమావేశంలో మాట్లాడారు. ప్రకృతితో కలిసి జీవిచంటం ప్రాముఖ్యతను తెలిపేందుకు పాఠశాల సిలబిస్లో వాతావరణ అంశాలను చేర్చాలని సూచించారు.
వాతావరణానికి అనుగుణంగా మానవులు జీవించడం నేర్చుకోవాలిని మోదీ అన్నారు. ఇప్పటికే చాలా సంప్రదాయ వర్గాల వారు దీనిని సొంతం చేసున్నట్లు తెలిపారు. వీటికి అనుగుణంగానే అభివృద్ధి విధానాల రూపకల్పన చేసుకోవాలని సూచించారు. భారత్లో అమలవుతున్న స్వచ్ఛ భారత్, ఉజ్వల వంటి పథకాలను ప్రస్తావించిన మోదీ.. వీటితో పౌరులు ప్రయోజనాలు పొందడమే కాకుండా జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయని గుర్తు చేశారు.
వాతావరణ మార్పులపై తరువాతి తరం వారికి అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని అన్నారు. ఇందుకు గానూ పాఠశాల విద్య నుంచే వారి సిలబస్లో ప్రధానాంశంగా ఉండేలా కృషి చేయాలని గ్లాస్గో వేదికగా పిలుపునిచ్చారు.
TAGGED:
PM Modi cop26