తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2020, 1:05 PM IST

ETV Bharat / international

కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా దుకాణాలు బంద్​

కరోనా వ్యాప్తిని ఎదుర్కొనే చర్యల్ని మరింత ముమ్మరం చేసింది ఇటలీ. ఔషదాలు, ఆహార సంబంధిత దుకాణాలు మినహా ఇతర వ్యాపార కేంద్రాలన్నింటినీ మూసివేయాలని ఆదేశించింది.

Italy shuts stores across country to fight virus
కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా దుకాణాలు బంద్​

కరోనా భూతం​ కొన్ని రోజులుగా ఇటలీని గడగడలాడిస్తోంది. వైరస్​ను కట్టడి చేసే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఔషధాలు, ఆహార సంబంధ దుకాణాలు మినహా ఇతర దుకాణాలన్నీ మూసివేయాలని ఆజ్ఞలు జారీ చేసింది. అవసరమైతే ఇంటికే సరుకులు చేరవేసే పద్ధతిని అమలు చేసుకోవాలని సూచించింది.

కఠిన ఆంక్షల నడుమ ఇటలీ ప్రజలు

బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా, ప్రార్థన మందిరాలకు వెళ్లకుండా ఇటలీవ్యాప్తంగా ఇప్పటికే ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఫలితంగా రోడ్లలన్నీ నిర్మానుష్యంగా మారాయి.

కరోనా వైరస్..​ ప్రజల ప్రాణాలపై యమపాశమై ఇప్పటికి 827మందిని పొట్టన పెట్టుకుంది. ఇటలీలో ఆరుకోట్ల మంది కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు.

ఇదీ చూడండి:ప్రజాస్వామ్యానికి సంకెళ్లు- ప్రలోభస్వామ్యం వెర్రితలలు!

ABOUT THE AUTHOR

...view details