ఇటలీలో కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలను తీవ్రతరం చేసింది ఆ దేశ ప్రభుత్వం. రోమ్-వాటికన్ ప్రాంతంలో రోడ్లపై కార్లను ఆపి తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం.
కాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కొంత మందిని తన ప్రైవేట్ లైబ్రరీలో ఉంచారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.