కొవిడ్-19ను అరికట్టేందుకు నూతన విధానం దిశగా అడుగులు పడుతున్నాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్పై బయోటెక్ కంపెనీ ప్రకటించింది. నావెల్ వైరస్ లాంటి కణ వ్యాక్సిన్ (వీఎల్పీ) విధానం అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ ప్రయోగాత్మక పరీక్షలు ప్రాంభించిందని స్పైబయోటెక్ సీఈఓ ప్రొఫెసర్ సుమీ బిస్వాస్ తెలిపారు.
''ఆస్ట్రేలియాలో జరిగిన పరిశోధన ఆధారంగా స్పై బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ల మద్య ప్రపంచవ్యాప్తంగా లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థల మధ్య జరిగిన కీలక ఒప్పందం ద్వారా సురక్షిత పద్ధతిలో, భారీ స్థాయిలో కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసే అవకాశం లభిస్తుంది. వీఎల్పీని అభివృద్ధి చేసేందుకు స్పై బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ కలిసి పని చేయటం ప్రస్తుత క్లిష్ట సమయంలో కీలక ముందడుగు.''