తెలంగాణ

telangana

ETV Bharat / international

కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ ఉక్రెయిన్'- త్వరలోనే వారంతా భారత్​కు! - ఉక్రెయిన్ భారత్ తాజా వార్తలు

Indian Embassy In Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్​లైన్స్​తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించాయి.

indian embassy in ukraine
రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు

By

Published : Feb 16, 2022, 3:34 PM IST

Indian Embassy In Ukraine: రష్యా- ఉక్రెయిన్​ మధ్య సంఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత్​- ఉక్రెయిన్​ మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్​లైన్స్​తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించాయి.

"ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఉక్రెయిన్​లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు స్వదేశానికి రావాల్సిందిగా ఫిబ్రవరి 15న భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. "

-- ప్రభుత్వ వర్గాలు

ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని భారత రాయబారి కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పార్లమెంటరీ కమిటీ ఆందోళన..

రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రవాణా, టూరిజం, సాంస్కృతిక శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్​లోని భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఇవీ చూడండి:

శాంతి బాటలో రష్యా .. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సైన్యం వెనక్కి!

Ukraine russia news: 'మేం యుద్ధాన్ని కోరుకోవడంలేదు'

'రష్యాపై నమ్మకం లేదు.. ఉక్రెయిన్‌పై దాడి జరగొచ్చు'

'తక్షణమే ఆ దేశం వదిలి వచ్చేయండి'.. భారతీయులకు కేంద్రం అలర్ట్!

ABOUT THE AUTHOR

...view details