తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్పత్రి నుంచి ప్రధాన మంత్రి డిశ్చార్జ్ - uk prime minister thanks medics

కరోనా బారిన పడిన బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటానంటూ ఆయన​ కృతజ్ఞతలు చెప్పారు.

johnson hails hospital staff
ఆస్పత్రి నుంచి ప్రధాన మంత్రి డిశ్చార్జ్

By

Published : Apr 12, 2020, 6:48 PM IST

Updated : Apr 12, 2020, 7:07 PM IST

జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అన్నారు. కరోనా వైరస్ చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరిన ఆయన ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. 'వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పను. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను' అని బ్రిటన్‌లోని సెయింట్ థామస్‌ ఆస్పత్రి సిబ్బందిని ఉద్దేశించి చెప్పినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేలగా కొద్ది రోజుల క్రితమే ఆయన స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరిన అనంతరం ఆయన్ను గతవారమే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి మెరుగైందని ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, గతంలో కంటే ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 79 వేలు దాటింది. శనివారం ఒక్కరోజే 10,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 9, 875 మంది మరణించారు. ప్రధాని ఆరోగ్యంపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ స్పందిస్తూ 'ఆయనకు మరికొంత సమయం విశ్రాంతి అవసరం. త్వరలోనే తిరిగి తన కార్యలయంలో పనులు ప్రారంభిస్తారు' అని అన్నారు.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం.. ఐరోపాలో 75 వేలు దాటిన మరణాలు

Last Updated : Apr 12, 2020, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details