హెపటైటిస్ సీ వ్యాధికి చికిత్సలో ఉపయోగించే మందులు.. కరోనా వైరస్పైనా ప్రభావం చూపుతాయని తాజా పరిశోధనలో తేలింది. సూపర్ కంప్యూటర్ సిములేషన్స్ ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు పరిశోధకులు.
జర్మనీలోని జాహన్నెస్ గుటెన్బర్గ్ విశ్వవిద్యాలయం(జేజీయూ) పరిశోధకులు.. డేటా బేస్ ఆధారంగా సార్స్-సీఓవీ2లోని ప్రోటీన్లతో దాదాపు 42వేల పదార్థాలు ఎలా బంధించి ఉంటాయనే దానిపై అధ్యయనం చేశారు. అనంతరం వైరస్ మనిషి లోపలకు ప్రవేశించకుండా, వ్యాప్తిచెందకుండా అవి ఎలా అడ్డుకుంటాయో గుర్తించారు.
అత్యంత శక్తిమంతమైన మోగన్ 2 సూపర్ కంప్యూటర్ను ఉపయోగించి రెండు నెలల్లో 30 బిలియన్ క్యాలిక్యులేషన్స్ చేశారు పరిశోధకులు. సిమిప్రేవిర్, పరిట్రాప్రెవిర్, గ్రాజోప్రెవిర్, వెల్పటాస్విర్ అనే నాలుగు హెపటైటిస్ సీ మందులు... సార్స్-సీఓవీ2ను గట్టిగా పట్టుకుని.. వైరస్ను నివారించగలుగుతాయని ఈ పరిశోధనల్లో తేలింది.