తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు!

ప్రతి వంటకంలోనూ ఉప్పు తప్పనిసరి. తగినంత ఉప్పు లేకుంటే ఏ ఆహారం రుచికరంగా ఉండదు. కానీ అతిగా ఉప్పు తీసుకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది ఓ సర్వే. రోగ నిరోధక శక్తి తగ్గిపోయి కరోనా వంటి ప్రమాదకర వ్యాధులు సులువుగా వచ్చే ప్రమాదముందని చెబుతోంది.

health-salt-immunity
ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు!

By

Published : Mar 30, 2020, 12:23 PM IST

ఉప్పు లేకుండా ఏ ఆహారం రుచిగా ఉండదు. ఆహారాన్ని నిల్వ చేయాలంటే కాస్త ఎక్కువగానే ఉప్పు వినియోగిస్తారు. ఉప్పు ఎక్కువ తింటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చాలా మంది విశ్వసిస్తారు. కానీ మోతాదు మించితే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

ఎలుకలపై ప్రయోగం

ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు రావడమే కాకుండా రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందని వెల్లడించింది ఓ అధ్యయనం. జర్మనీలోని యూనివర్శిటీ హాస్పిటల్ బాన్ పరిశోధకులు ఇందుకు ఎలుకలకు అధిక ఉప్పు కలిపిన ఆహారాన్ని అందించి పరిశోధనలు జరిపారు. ఈ ఫలితాలను సైన్స్​ ట్రాన్స్​లేషనల్​ మెడిసిన్​ జర్నల్​లో ప్రచురించారు.

ఆరు గ్రాముల ఉప్పుతో...

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు మేరకు రోజుకు ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంటే సుమారు టీస్పూన్​తో సమానం. కానీ పరిశోధకులు కొంత మందికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అందించి, రోగ నిరోధక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుందో పరిశీలించారు. ఆరు గ్రాముల ఉప్పు రెండు ఫాస్ట్​ ఫుడ్​ భోజనాలకు వాడే ఉప్పుతో సమానం.

" అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అధికంగా ఉప్పు తీసుకోవడం రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని మొదటిసారిగా నిరూపించాం. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు మేం ఊహించని విధంగా ఎక్కువ ఉప్పు తీసుకుంటే మంచిదనే వెల్లడించాయి. కానీ అవన్నీ తప్పని మేం నిరూపించగలిగాం."

-- క్రిస్టియన్​ కుర్ట్స్​, బాన్ విశ్వవిద్యాలయం

ఇదీ చదవండి:రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన బామ్మను కరోనా కాటేసింది

ABOUT THE AUTHOR

...view details