తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆమెకన్నా ఆమె కురులే పొడవు! - అమ్మాయి

235 సెంటిమీటర్ల పొడవు జుట్టు పెంచి గిన్నిస్ రికార్డుకు దగ్గరలో ఉంది ఉక్రెయిన్​కు చెందిన ఒలినా కొర్జెన్యూక్. ఇప్పటివరకు 170.5 సెంటిమీటర్లే గిన్నిస్ రికార్డు.

జుట్టు పొడెక్కువున్న టీనేజర్

By

Published : Mar 19, 2019, 3:10 PM IST

Updated : Mar 19, 2019, 8:56 PM IST

ఆమెకన్నా ఆమె కురులేపొడవు!

ఒకప్పుడు ఆడపిల్లలకు జుట్టు ఎంత ఎక్కువుంటే అంత అందంగా ఉంటారని నమ్మకం. ఇప్పుడు క్రాఫింగ్​లతో జుట్టు సైజు తగ్గుతూ వస్తోంది. కానీ ఉక్రెయిన్​కు చెందిన ఓ యువతి పొడవాటి జట్టుతో జాతీయ రికార్డు సాధించింది. 235 సెంటీమీటర్లు(రెండు మీటర్లపైనే) పొడవుగా జుట్టును పెంచింది 15 ఏళ్ల ఒలినా కొర్జెన్యూక్. ఆమె 165 సెంటిమీటర్ల ఎత్తుంటే తన కంటే పొడవుగా కేశాలను పెంచింది. ప్రస్తుతం గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నిస్తోంది.

పొడవైనా కేశాలతో ఆకట్టుకుంటున్న ఒలినా

ఇప్పటివరకు ఆ దేశంలో 135 సెంటిమీటర్ల పొడవున్న జుట్టే రికార్డు. ప్రస్తుతం ఆ రికార్డుని తన పేరున లిఖించుకుంది ఒలినా. విశేషమేంటంటే గత ఆరు నెలల కాలంలోనే 50 సెంటిమీటర్ల జుట్టును పెంచింది. సాధారణంగా బ్లాండీ హెయిర్(పట్టు వర్ణంలోని జుట్టు) ఇంత పొడవు పెరగదని ఒలినా హెయిర్​ స్టైలిస్ట్ యూరీ తెలిపారు.

ఒలినా జుట్టు అంత సులభంగా పెరగలేదు. రోజూ దీనికి తగిన జాగ్రత్తలు పాటించింది. జుట్టును శుభ్రపరచుకునే దగ్గరి నుంచి దువ్వడం, చిక్కుతీసుకునే వరకు ఒలినా తల్లి మర్యానా సాయంచేసేది. వెంట్రుకలను శుభ్రపరచడానికే 30 నిమిషాలు పడితే, జడ వేయడానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

"నాకు మూడేళ్లప్పుడు ఒకే ఒక్కసారి జుట్టు కత్తిరించుకున్నాను. అప్పటినుంచి ఇంతవరకు కత్తిరించలేదు. సాధారణంగా క్రైస్తవ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లల వెంట్రుకలు కత్తిరిస్తారు. కానీ నాకు అలా చేయలేదు. నాకు నా జుట్టు అంటే ఎంతో ఇష్టం దీన్ని ఎప్పటికీ కత్తిరించను" -- ఒలినా కొర్జెన్యూక్

డిసెంబరు 2018 నాటికి 170.5 సెంటిమీటర్లు పొడవున్న జుట్టుతో భారత్​కు చెందిన నిలాన్షీ పటేల్ గిన్నిస్ రికార్డుకెక్కింది. 235 సెంటిమీటర్ల పొడవుతో ఆ రికార్డును అధిగమించిన ఒలినా గిన్నిస్​ ఘనతకు ఎంతో దూరంలో లేదు.

Last Updated : Mar 19, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details