ప్రపంచంలో రోజురోజుకీ భూతాపం పెరిగిపోతోందని పర్యావరణ సంరక్షకులు చెబుతూనే ఉన్నారు. భూతాపం పెరగటం వలన నదులు, సరస్సులు ఎండిపోతున్నాయి. ఫలితంగా జల చరాలు మృత్యు వాతపడుతున్నాయి. సరస్సు ఎండిపోయి పదివేలకు పైగా చేపలు మరణించిన దుర్ఘటన ఉత్తర గ్రీస్‌లో చోటు చేసుకుంది.
'భూతాపం': సరస్సు ఎండిపోయి.. వేలాది చేపలు మరణించి..! గ్రీస్‌లోనే అతిపెద్ద సరస్సుల్లో కొరోనియా ఒకటి. గ్రీస్ థెస్సలొనీకి తూర్పున 30 కిలోమీటర్లు దూరంలో ఉందీ సరస్సు. గత మూడేళ్లలో కొరోనియా సరస్సులో 70 శాతానికి పైగా నీటి పరిమాణం తగ్గిపోయింది. 80 సెంటిమీటర్లు (31 అడుగులు) నీరు లోపలికి వెళ్లిపోయింది. దీని వల్ల కార్ప్, సన్ ఫిష్, బ్లిక్ ఇలా వేలాది చేపలు మరణించినట్లు అధికారులు తెలిపారు.
కొరోనియా సరస్సును సంరక్షించేందుకు గ్రీస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సరస్సు ఎండిపోకుండా నీటిని మళ్లించటం, తాత్కాలికంగా చేపల వేట నిలుపుదల, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కొలనులోకి వదలకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. నీటిపరిమాణం తగ్గటం వల్ల పరిసర గ్రామాలు జీవనోపాధిని కోల్పోయాయి.
'కొలనులో పుష్కలంగా నీరు ఉండేది. ఇది చాలా మందికి జీవనోపాధి కల్పించింది. కానీ ప్రస్తుతం నీటి సాంద్రత తగ్గటం వల్ల వేలాది చేపలు మరణించి.. తమ జీవనంపై తీవ్ర ప్రభావం చూపిందని' స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:జమ్ములో భాజపా 'జన జాగరణ అభియాన్' ర్యాలీ