కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రష్యాలో ఇవాళ 6 వేల 431 కేసులు నమోదయ్యాయి. మరో 150 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 19,799కు చేరింది.
- బ్రిటన్లో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 6,178 కొత్త కేసుల్ని గుర్తించారు. ఇరాక్, ఇజ్రాయెల్లోనూ మరో 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
- మెక్సికోలో 4,683 కొత్త కేసులు వెలుగుచూశాయి ఒక్కరోజే 651 మంది మరణించారు.
- నేపాల్లో బుధవారం 1172 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 67 వేల 804 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే 1893 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు. దేశంలో రికవరీ రేటు 73.7 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 7 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 436కు చేరింది.
- సింగపూర్లో ఇప్పటివరకు 57 వేల 639 మందికి కరోనా సోకింది. 27 మంది మరణించారు. 12 కొత్త కేసులను గుర్తించారు.
పాక్లో తెరుచుకున్న స్కూళ్లు..
పొరుగుదేశం పాకిస్థాన్లో దాదాపు 6 నెలల విరామం తర్వాత.. పాఠశాలలు తెరుచుకున్నాయి. 6-8 తరగతుల విద్యార్థులను స్కూళ్లకు అనుమతిస్తున్నారు. కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది ప్రభుత్వం.