కరోనా ప్రభావిత దేశాల్లో జర్మనీ ఒకటి. రోజు రోజుకు వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశంలో మాస్కుల కొరత ఏర్పడింది. ఈ సమస్య అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి మాస్కులను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో దాదాపు 6 మిలియన్ల మాస్కులు.. కెన్యాలో అదృశ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది.
మాస్కులు అదృశ్యమవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ అధికార ప్రతినిధి తెలిపారు.
గతవారమే..
గత వారమే కెన్యా విమానాశ్రయంలో ఈ మాస్కులు అదృశ్యమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. కరోనా వైరస్‌తో ఇప్పటికే అవస్థలు పడుతున్న ప్రభుత్వానికి ఈ మాస్క్‌లు మాయం కావడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నట్లు ఓ మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించింది. మాస్కులకు సంబంధించి ఎటువంటి చెల్లింపులు చేయనందున ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
జర్మనీ వ్యాప్తంగా మొత్తం 27,436 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:'దేశదేశాలు తిరిగి సేవచేస్తుంటే అవమానిస్తారా?'