తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-7: మోదీ-ట్రంప్​ భేటీలో ప్రధాన అంశాలు ఇవేనా? - ప్రతిపాదనలు

జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో మోదీ సమావేశమవుతారు. భారత ప్రధానితో కశ్మీర్​ అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ట్రంప్​ ప్రకటించారు. ఈ అంశంతో పాటు వాణిజ్య సుంకాల సరళీకరణపై ఇరుదేశాల నేతలు చర్చించే అవకాశం ఉంది.

జీ-7: మోదీ-ట్రంప్​ భేటీలో ప్రధాన అంశాలు ఇవేనా?

By

Published : Aug 25, 2019, 8:57 AM IST

Updated : Sep 28, 2019, 4:43 AM IST

ఫ్రాన్స్​ తీర ప్రాంతం బియారిట్జ్​లో నేడు జీ-7 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​- భారత్​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీకానున్నారు. ఈ సమావేశంలో వారు ఏ అంశాలపై చర్చిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కశ్మీర్​ అంశం?

కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ట్రంప్​ స్పష్టం చేశారు. ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో భారత్​-పాక్​ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై ట్రంప్​ పలుమార్లు స్పందించారు. ఈ పరిణామాల మధ్య ఆదివారం మోదీతో జరగనున్న భేటీలో కశ్మీర్​పై ట్రంప్​ ప్రధానంగా చర్చించే అవకాశముంది.

అయితే కశ్మీర్​ భారత అంతర్గత విషయమని.... ఇందులో మరెవరూ తలదూర్చే అవకాశం లేదని ప్రపంచ దేశాలకు భారత్​ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

వాణిజ్యం?

ఈ భేటీలో వాణిజ్య సుంకాల సరళీకరణపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా భారత్​లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని, తమకు వాణిజ్య ద్వారాలు తెరవాలని ట్రంప్​ కోరనున్నట్లు సమాచారం.

అపనమ్మకాల మధ్య జీ-7

వాణిజ్య యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం కోరలు చాస్తున్న వేళ... అనేక సందేహాలు, అపనమ్మకాల మధ్య జీ-7 శిఖరాగ్ర సదస్సు ఫ్రాన్స్​లో జరుగనుంది. ప్రపంచంలోని 7 సంపన్న దేశాలు... అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్​, ఇటలీ, కెనడా దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఇదీ చూడండి: నేడు జీ7 దేశాల సదస్సు- ప్రత్యేక అతిథిగా మోదీ

Last Updated : Sep 28, 2019, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details