ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత నోటర్ డామ్ చర్చిలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనలో చర్చి పైకప్పు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈస్టర్ పర్వదినం కోసం ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
ఎంతో విశిష్ఠ చరిత్ర కలిగిన నోటర్ డామ్ చర్చిలో ప్రమాదం జరగడం పారిస్ వాసులను కలచివేసింది. మంటలు ఆరిపోవాలని కొందరుసీన్ నదిఒడ్డున ప్రార్థనలు చేశారు.
శతాబ్దాల చరిత్ర
నోటర్ డామ్ చర్చిని 12వ శతాబ్దంలో ప్రారంభించారు. 10 శతాబ్దంలో మొదలుపెట్టిన నిర్మాణం 200 ఏళ్లపాటు కొనసాగింది. 18వ శతాబ్ద ప్రారంభంలో క్యాథలిక్‌లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చర్చి ధ్వంసమైంది. రెండు దశాబ్దాలు కష్టపడిన వాస్తుశిల్పి యూజీన్ వయోల్లెట్ పూర్వ రూపం తీసుకొచ్చారు.
ఈ చర్చి విధ్వంసమే ముఖ్య భూమికగా తీసుకున్న ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో.. "ది హంచ్ బ్యాక్ ఆఫ్ నోటర్‌డామ్" నవలను రాశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల ఆక్రమణ నుంచి తప్పించుకున్నందుకు సూచనగా ఆగస్టు 24, 1944లో ఈ చర్చి గంటలను మోగించారు.
అధ్యక్షుడి ప్రసంగం రద్దు
ప్రమాదం కారణంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమావేశాలను రద్దు చేసుకున్నారు. "మనలో భాగమైన చర్చిలో మంటలు చెలరేగటం ఎంతో బాధాకరం" అని ట్వీట్ చేశారు మాక్రాన్.