ఫ్రాన్స్‌లోని లయన్ నగరంలో శుక్రవారం పేలుడు జరిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో నగరంలో రద్దీగా ఉండే పాదచారుల వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలో మరో రెండురోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పేలుడు సంభవించడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
మేకులున్న ఓ ప్యాకేజీని పేలుడుకు వినియోగించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.