ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఘోరం జరిగింది. పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ఓ దుండగుడు ప్రవేశించి నలుగురు పోలీసులను పొడిచి చంపాడు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న పోలీసులు హంతకుడిని అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు.
పారిస్: పోలీస్స్టేషన్లోనే నలుగురు పోలీసుల హత్య..! - పోలీస్స్టేషన్లోనే 4 పోలీసులను చంపిన దుండగుడు
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ఓ దుండగుడు ప్రవేశించి నలుగురు పోలీసులను హత్యచేశాడు. అప్రమత్తమైన రక్షకభటులు నిందితుడిని అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు. దాడికి పాల్పడిన వ్యక్తి అదే పోలీసు కార్యాలయంలో పనిచేసే వ్యక్తిగా దర్యాప్తులో తేలింది.
పారిస్: పోలీస్స్టేషన్లోనే నలుగురు పోలీసుల హత్య..!
ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తి పోలీసు కార్యాలయంలోనే పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. అయితే హత్యకు పాల్పడడానికి కారణం మాత్రం తెలియరాలేదు.
ఇదీ చూడండి:టొయోటా 'లెక్సస్' నుంచి కొత్త కారు.. ధర రూ.99 లక్షలే..!