ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / international

లక్ష రకాల పుష్పాలు ఒక్క చోట వికసిస్తే..! - బెల్జియమ్

బెల్జియమ్​లో ఒకే చోట లక్ష రకాల పూలు సమావేశమయ్యాయి. పూలు అలంకరించే 30 మంది అంతర్జాతీయ వ్యాపారులు వాటిని ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. బ్రసెల్స్​లోని 'గ్రాండ్​ ప్లేస్'లో వికసించిన ఆ పూలను అద్భుతంగా అలంకరించారు.

లక్ష రకాల పుష్పాలు ఒక్క చోట వికసిస్తే..!
author img

By

Published : Aug 18, 2019, 6:59 PM IST

Updated : Sep 27, 2019, 10:27 AM IST

లక్ష రకాల పుష్పాలు ఒక్క చోట వికసిస్తే..!
బెల్జియమ్​ రాజధాని బ్రసెల్స్​లో వరల్డ్​ ఆఫ్​ ఫ్లోరల్​ ఎమోషన్స్​(పుష్పాల భావోద్వేగ ప్రపంచం) పూల పండుగను నిర్వహిస్తున్నారు. ఇందుకు 'ది గ్రాండ్ ప్లేస్' వేదికైంది. ప్రపంచ దేశాల నుంచి 30 మంది పూల అలంకరణ కర్తలు ఈ పండుగలో పాల్గొన్నారు. రెండేళ్లకు ఒకసారి ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ పూల పండుగ సందర్భంగా నగరంలో కొలువుదీరిన పురాతన 'మానెకన్ పిస్​' శిల్పం కూడా ఒంటి నిండా పూలు పులుముకుంది.

ఒక్కసారి ఈ ప్రదర్శన జరిగే గ్రాండ్ ప్లేస్​ లోపలికి ప్రవేశిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు లక్ష రకాలకు పైగా పుష్పాలను ఇక్కడ మీరు చూడొచ్చు.

బ్రసెల్స్​లోని ప్రముఖ పర్యటక ప్రదేశం అటామియమ్​ స్పియర్ ఆకారంలో పూలను అలంకరించిన విధానం వీక్షకులకు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని రంగురంగుల పూలని చూస్తేనే మనసు తేలికవుతుంది. ప్రముఖ బెల్జియన్​ డిజైనర్ నటాలియా ఈ కళాకృతికి రూపం ఇచ్చారు


ఈ ప్రదర్శన మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడికి రాగానే మొదటగా వేలాడుతున్న బంతులు కనిపిస్తాయి. అవి అటామియమ్​ స్పియర్ ఆకారంలో ఉంటాయి​. 9 స్పియర్స్​ ఉన్నాయి. బ్రసెల్స్​లో ప్రతి ఒక్కరూ చూడతగ్గ ప్రదర్శన ఇది.
-నటాలియా సకలోవా, డిజైనర్

ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేక ఆకర్షణ బీజింగ్​ ఫ్లవర్​ స్కూల్​ రూపొందించిన ఆకృతి. పురాతన చైనా సంగీత వాయిద్యమైన 'కాంగూ' స్పూర్తితో వీటిని కళాత్మకంగా తీర్చిదిద్దినట్లు డిజైనర్ జూడి జాంగ్​ తెలిపారు. ఆగస్టు 14న నుంచి 18వ తేదీ వరకు ఈ పూల పండుగ నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: భూటాన్​ విద్యార్థులకు ప్రధాని మోదీ 'క్లాస్​'

Last Updated : Sep 27, 2019, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details