తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరోపాలో ఫైజర్​ టీకాపై తొలిసారి ప్రతికూల ప్రభావం - ఫైజర్​ వ్యాక్సిన్​పై తొలిసారి అక్కడ ప్రతికూల స్పందన!

కరోనాపై పోరులో భాగంగా ఐరోపా విడుదల చేసిన ఫైజర్​ టీకాపై తొలిసారిగా ప్రతికూల ప్రభావం నమోదైంది. ఫిన్​లాండ్​లో ఈ తరహా కేసు వెలుగుచూసింది. రోగి గోప్యత కారణంగా మరిన్ని వివరాలు వెల్లడించలేమని అధికారులు పేర్కొన్నారు.

Finland confirms first adverse reaction to Pfizer/BioNTech COVID-19 vaccine
ఫైజర్​ వ్యాక్సిన్​పై తొలిసారి అక్కడ ప్రతికూల స్పందన!

By

Published : Jan 3, 2021, 5:40 AM IST

ఐరోపాలో ఫైజర్​ టీకాపై తొలిసారిగా ప్రతికూల ప్రభావం ఎదురైంది. తమ దేశంలో ఈ తరహా కేసు నమోదైందని ఫిన్​లాండ్​ మెడిసిన్స్​ ఏజెన్సీ(ఎఫ్​ఎంఏ) ఓ ప్రకటనలో తెలిపింది.

వైరస్​ వ్యాప్తిని నివారించేందుకు గత నెల 27న ఈయూ సభ్యదేశాలు టీకా పంపిణీ చేపట్టగా.. వారం రోజుల అనంతరం ఇలా ప్రతికూల స్పందన రావడం గమనార్హం. ఇలాంటి కేసులు కనీసం 5 నమోదైన అనంతరం ఈ వ్యవహారంపై మరిన్ని విషయాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి రోగి గోప్యత కారణంగా పూర్తి వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఫిన్​లాండ్​లో ఇప్పటివరకు 5 జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రులలో.. ఆరోగ్య కార్మికులకు కొవిడ్​ వ్యాక్సిన్​ ఇచ్చినట్టు సమాచారం.

ఇదీ చదవండి:'వారానికి 2 మిలియన్ల వ్యాక్సిన్​ డోసులు'

ABOUT THE AUTHOR

...view details